దత్త మాయను దాటగ లేరు-దేవతలైనా దేవర్షులైనా॥
క్రీగంట చూడ క్రీడించుచుందువు
కన్ను త్రిప్ప కటకట లాడుదువు ॥దత్త మాయను॥
నరరూపమున నడచి వచ్చును
త్రిగుణ మాయను త్రిప్పుచునుండును
కనుగొన తరమే కాలునికైన
లీలా వినోదిని లెస్సగ చూడుము ॥దత్త మాయను॥
అహంకారము నంతము చేసి
మమకారమును మరల్చు మతనికి
నారాయణుడు నటనము నాపి
దారిని చూపు దరికి చేర్చును ॥దత్త మాయను॥