నరుల కోసమే నారాయణుడు - నరరూపమున అవతరించగ
పశువైన గోవు కూడ గుర్తించి - క్షీరము నీయ స్వామికి భక్తితో
మత్సరియగు సాటి మానవుడు - దండముతో తలమీద కొట్ట
జగన్నాధుడే తల్లడిల్లెను - చోరుడన్న నిందతో - నవ్వుల పాలై నలిగి పోయెను
రక్తధారతో నడచుచుండగ - వకుళ మాత చూచి ఏడ్చెను
తిరునంబిదాసు బావిని త్రవ్వగ - మట్టిని మోసెను నరాకారమున
ఆలస్యమే చేసితివనుచు - స్వామిని కొట్టెను గునపముతో
గడ్డము చిట్లెను రక్తము చిందగ - వెడలి పోయెను దేవాలయమున
విగ్రహమునందున ఆగదు రక్తము - తిరునంబిదాసు ఆలోకించి
వలవల ఏడ్చెను చందన మద్దెను
చేతులు కాలగ ఆకుల పట్టి ప్రయోజనమేమి? పామరుడా!