గొల్లభామల గోల చేసిన గోపాలకుని కోటి లీలలు
బృందావనిని చిందు లేసిన మురళీధరుని తీపి పాటలు
ఆహవంబున మోహనాశక పార్ధసారధి తత్త్వబోధలు
మాటిమాటికి గుర్తువచ్చెను మధురాధిపతి
మాటలన్నియు పాటలన్నియు ఆటలన్నియు
గోవర్ధనమును గోటనెత్తిన గోవిందుని చిన్ని నవ్వులు
కాళి యాహిని కాలదన్నిన గోపబాలుని తాండవంఋలు
నెమలి పింఛము కదులుచుండగ నీరజాక్షుని నర్తనంఋలు
మాటిమాటికి గుర్తువచ్చెను మధురాధిపతి
మాటలన్నియు పాటలన్నియు ఆటలన్నియు
పీతాంబరము తళుకు లొలకగ వాసుదేవుని నడక సొగసులు
తులసి మాలలు తూలుచుండగ తోయజాక్షుని సంధి పలుకులు
విశ్వ రూపము ప్రదర్శించిన నారాయణుని అట్టహాసము
మాటిమాటికి గుర్తువచ్చెను మధురాధిపతి
మాటలన్నియు పాటలన్నియు ఆటలన్నియు
పాంచజన్యము పూరించునెడ మధుసూదనుని ముగ్ధరూపము
భీష్మ శరము గాయములొప్ప చక్ర హస్తుని దూకు కోపము
బృందావనిని రాధ ఏడ్వగ ద్వారకాపతి తీవ్రతాపము
మాటిమాటికి గుర్తువచ్చెను మధురాధిపతి
మాటలన్నియు పాటలన్నియు ఆటలన్నియు
బృందావనము నందు నిలచిన సుందరాంగుని అందచందము
సుమకరందము చిందు లొందగ కుందరదనుని మందహాసము
ఇందీవరదృ గాత్మ మందిర మిందిరాపతి ఇందిందిరము
మాటిమాటికి గుర్తువచ్చెను మధురాధిపతి
మాటలన్నియు పాటలన్నియు ఆటలన్నియు