నిలబెట్టినావు నీరజాక్షా నన్ను
నడిపించినావు నారాయణా నన్ను
ఏమి చేసెదనయ్య ఏకాద్వితీయ నీకు।
ఋణము తీర్చేదెట్లు ఋషినాయకా దత్త నీ
ఋణము తీర్చేదెట్లు ఋషినాయకా దత్త॥
మూగవాడైన నన్ను ముఖ్య గురువుగ చేసి
వెర్రినగు నాచేత వేదార్ధమును పలికించి
పనిచేసినావనుచు జీత భత్యములనిచ్చి
మురిసేవు ఇది ఏమి మురిపెమయ్యా నీకు।
మూలమూలము నీవె ముద్దు దత్తా కనుగొన్న॥