నగుమోముతో నడిచెడివాడు । నన్నేలిన నారాయణుడు
దర్శనమిచ్చిన దత్తాత్రేయుడు । దయామయుడైన శ్రీసత్యసాయి (పల్లవి)
కాలాంబుద కేశ జటా జూటాలంకృతుడు
దివ్య భక్తి గాన గంగాధారా దాయకుడు
జ్ఞానాగ్ని చక్షుసా నాస్తిక మత దాహకుడు
విభూతిని సృష్టించెడి విశ్వేశ్వరుడు ॥
కాషాయముతో కమనీయ రూపముతో
వేదాంత సార వాక్య విన్యాసముతో
వ్రేలిని త్రిప్పుచు కర్మఫలముల వ్రాతతో
సామగానముతో సత్య లోకేశ్వరుడు ॥
చిత్రావతీ విరజా తీర పర్తి వైకుంఠములో
సాధు సజ్జన సందోహ క్షీర సాగరములో
దుర్మత ఖండన వాద సుదర్శన చక్రముతో
సాక్షాత్తుగా వచ్చిన శ్రీసత్యనారాయణుడు ॥