యోగ్యుడ కాను ఏ విధి చూసిన ఓ సాయీ
యోగ్యుడ కాను ఓ సత్య సాయీ ॥ (పల్లవి)
రత్నాకర వంశ క్షీర సాగర రాకా సుధాకరా
ఈ సృష్టిలోన నీకన్న యోగ్యుడు ఎవరని పలికితివీ
సత్యము తెలియును ఓ సత్యసాయీ. అసత్యములాడకుమా
నాపైనున్న నీ అకారణ కరుణయే నీ పలుకుకు కారణము ॥
పుట్టపర్తి పుట్టలోన దాగి ఉన్న దత్తరూపా
సత్యసాయి నాగరాజ దర్శనమ్ము నీయవయ్యా ॥