శ్రీసత్యనారాయణ రాజు - సర్వలోకాలకు రాజాధిరాజు ॥ (పల్లవి)
అనంతపురము దాహార్తులకు గంగాజలము నిచ్చిన దాత ॥
ఉచిత విద్యతో విధ్యార్ధులకు క్రమ శిక్షణ నేర్పిన గురువు ॥
లక్షలు చేసెడి శస్త్రచికిత్సల పైసయు లేకయె చేయించినాడు ॥
పండిత కవులకు బంగారు గొలుసులు చేతితో సృష్టించి ఇచ్చినవాడు ॥
ఆధ్యాత్మ పధమున నిస్స్వార్ధ సేవకు మురిసి మురిసి మోక్షమిచ్చినవాడు ॥