పరువు నిలబెట్టినావు పరమాత్మా - నా పరువు నిలబెట్టినావు
బరువు నెత్తుకున్నావు భగవంతా - నా బరువు నెత్తుకున్నావు ((పల్లవి)
ఓ పుట్టపర్తి బాబాయి, ఓ షిర్డీ పెదనాన్న, ఓ దత్త కన్న తండ్రీ
నా కర్మ ఫలములన్ని కఠినంబులై ఎదురొడ్డి నిలువ
నీ చేయి గుండ్రముగ త్రిప్పినావు- నీ చేతి సటకాను ఝళిపించినావు
కరుణా కరంబైన నీ కడగంటి చూపుతో ఒకసారి నను జూచి
సిరుల వర్షించినావు, వీడు నా వాడని నన్నాదుకున్నావు.