home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

మామవ దత్తప్రభో!


మామవ దత్తప్రభో!
కపిం కపిలావతార! (పల్లవి)

ఓ దత్త ప్రభో! బ్రహ్మర్షియైన కపిలునిగా అవతరించినవాడా! కపినైన నన్ను కాపాడు. (కోతి వలె జీవుని మనస్సు అతి చంచలమైనది.)

తవ పద కమలానతమ్,
కోమల కమలా హృదయ!

నీ పాద పద్మములయందు శిరస్సునుంచిన నన్ను, సుకుమారమైన శరీరాంగములుకల శ్రీలక్ష్మీమాతను హృదయమందు నిలుపుకొన్న ఓ దత్త ప్రభో! హే కపిలావతార! దయతో కాపాడు.

భవపల్వల సంకులమ్,
త్రిమత సమన్వయ మూల!

శంకర-రామానుజ-మధ్వాచార్యుల స్వమత వేదాంత సిద్ధాంతములకు పరస్పర విరోధం లేకుండగ ఖచ్చితమైన తర్కంతో వేద ప్రమాణానుసారం చేసిన త్రిమత సమన్వయమునకు మూల కారణమైన వాడా! ఓ దత్త ప్రభో! హే కపిలావతార! ఈ ప్రపంచమనే ఊబిలో దిగబడిన నన్ను కాపాడు.

త్వత్తో న పరా గతిః,
త్వమేవ శరణం నాథ!

నా స్వామీ! నీవు తప్ప నాకు వేరే ఏ గతియునూ లేదు. నిన్నే శరణముజొచ్చితిని. ఓ దత్త ప్రభో! హే కపిలావతార! కపినైన నన్ను కాపాడు.

 
 whatsnewContactSearch