ప్రవృత్తి నివృత్తి శాఖా ద్వయమ్,
వందే దత్తం వేద వృక్షమ్ ॥ (పల్లవి)
వేదవృక్షమై భాసిల్లుతూ ప్రపంచముతో జీవుని సంబంధము (ప్రవృత్తి), భగవంతునితో జీవుని సంబంధము (నివృత్తి) అనే రెండు చేతుల వంటి శాఖలను కలిగిన శ్రీ దత్తునకు (నీకు) నమస్కరిస్తున్నాను.
ప్రవృత్తౌ ధర్మ ఏవ తవ కామ్యః,
నివృత్తౌ తవ కామ్య ఏవ ధర్మః ॥
ప్రాపంచిక జీవితంలో మేము ధర్మమును ఆచరించుటయే నీకు ఇష్టము. కాని మా ఆధ్యాత్మిక జీవితంలో నీ ఇష్టమే మాకు ధర్మము.
ప్రవృత్తి రధర్మోపరి స ధర్మో,
నివృత్తి రస్యోపరి పరమాత్మా ॥
ప్రాపంచిక జీవితంలో (ప్రవృత్తిలో) అధర్మము కంటె ధర్మము గొప్పది. కాని ఆధ్యాత్మిక జీవితములో (నివృత్తిలో) ధర్మము కన్ననూ పరమాత్మయే గొప్పవాడు.
ప్రవృత్తి రుర్వ్యాం నిర్మిత మూలమ్,
నివృత్తి రాకాశగ సౌధాగ్రమ్ ॥
భూమిలో నుండి నిర్మించినా కలబడని పునాది వలె ఆధ్యాత్మిక జీవితమునకు, ప్రాపంచిక జీవితము (ప్రవృత్తి) ఆధారమై ఉండగా ఆధ్యాత్మిక జీవితము (నివృత్తి) అదే పునాదిపై నిర్మించిన భవనము యొక్క, ఆకాశమును తాకే చివరి అంతస్తు వంటిది.