దయామయ శ్రీ దత్తాత్రేయ!
జ్ఞానం భక్తిం సేవాం దేహి ॥ (పల్లవి)
ఓ దయా స్వరూపా, శ్రీ దత్తాత్రేయా! దయతో నీవు నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తిని మరియు అట్టి అవకాశాన్నినీకే క్రియాత్మకమైన సేవ చేసు కొనడానికి అనుగ్రహించుము.
జ్ఞాతా జీవో దేవో న ఖలు,
పరా ప్రకృతి రితి గీయతే కిల ॥
త్రిపుటి జ్ఞానంలో భాగమైన మూటిలో తెలుసుకొనేవాడే జీవుడు కాని, వాడు దేవుడు కాదు గద. శ్రీ మద్భగవద్గీతలో చెప్పినట్లు ఈ జీవుడు పరాప్రకృతి అనబడతాడు, లేక అద్భుతమైన ఈ సంపూర్ణ సృష్టిలో జీవుడు అత్యుత్తమమైన భాగమని చెప్పబడతాడు.
జ్ఞానం మార్గో జ్ఞాన భక్త్యా,
కర్మ చ ఫలిత త్యాగో భవతి ॥
భగవంతుని పొందడానికి జీవునికి జ్ఞానమే మార్గము. అట్టి మార్గము ఆధ్యాత్మిక జ్ఞానము మరియు భక్తితో కూడినది. ఈ మార్గము ద్వారా సేవయు (కర్మ సంన్యాసము), తను చేసిన కర్మల ఫల త్యాగము (ధనేషణను జయించుట) భగవంతునికి సమర్పించడం జరుగుతుంది.
జ్ఞేయమనూహ్యం సోపాధికం తు,
సేవ్యం నౄణాం నరావతారీ ॥
అనూహ్యమైన పరబ్రహ్మమే చేరవలసిన లక్ష్యము. కాని, అట్టి అనూహ్య తత్వాన్ని మనం బాగా తెలిసినకొనగలిగే మాధ్యమమైన (ఉపాధి సహితంగా) నరావతారములో వచ్చినపుడే సేవించుకొనడం సాధ్యమవుతుంది. సమస్త మానవాళికి అట్టి సాక్షాత్తుగా సేవించుకొనదగిన మాధ్యమంలో వచ్చిన భగవంతుడే, మనుష్య శరీరమును ధరించి వచ్చిన అనూహ్య పరబ్రహ్మము.