గంగా యమునా సరస్వతీనామ్,
సంగమోఽ సి నను దత్తాత్రేయ! ॥ (పల్లవి)
ఓ దత్తాత్రేయా! పవిత్రమైన మూడు గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమము నీవే అయి ఉన్నావు కద.
జ్ఞానం బ్రహ్మా సరస్వతీశః,
సద్గురు బోధ ప్రవచనేన ॥
దత్తాత్రేయా! నీవే మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే బ్రహ్మవు, గురు దత్తుడవు, జ్ఞాన నదీప్రవాహానికి ప్రతీకయైన సరస్వతికి నాథుడవు.
గంగా చరణో భక్తిర్విష్ణుః,
ప్రతిఫల రహిత ప్రేమ రసేన ॥
దత్తాత్రేయా! పాదముల నుండి ఉద్భవించి ప్రవహించే గంగానదికి మూలమైన విష్ణుమూర్తివి నీవే. ఏ విధమైన ప్రతిఫలాపేక్షలేని నిజమైన భక్తికి, ప్రేమరస ప్రవాహానికి గంగానదియే ప్రతీక.
అజ్ఞాన్యాదిమ తమోంఽశు యమునా-
విభూతి జనకః శంకరస్త్వమ్ ॥
దత్తాత్రేయా! ఆధ్యాత్మిక ప్రయాణము యొక్క ప్రారంభంలో ఉండే అజ్ఞానులైన భక్తులు విశ్వాసం కలగడానికై సద్గురువునుండి కొన్ని మహిమలు చూడాలని కోరుకొంటారు. అటువంటి అనూహ్యమైన మహిమలకు మూలమైన శివుడవు నీవే. నల్లటి తమస్సు అనే గుణాన్ని కలిగి, నీలి రంగులో ఉండే యమునా నది అట్టి నీకు ప్రతీక.