(Sung by Smt. Devi)
గురుస్త్వమేవ త్వమేవ భగవాన్ ।
దక్షిణ వామౌ తవ తౌ దత్త! ॥ (పల్లవి)
ప్రభో దత్త! నీవే జీవులందరికీ ఆచార్యుడవు మరియు నీవే భగవంతుడవు. ఆచార్యుడు మరియు భగవంతుడు అనే ఈ రెండు అంశములు వరుసగా నీ కుడి, ఎడమ పార్శ్వములుగా తెలుసుకోవాలి.
సరైన లక్ష్యాన్ని బోధించే ఆచార్యుని ఆ లక్ష్యముకంటె శ్రేష్ఠమైన వాడిగా గమనించాలి. అందుచేతనే, దత్తుని శరీరంలో ముఖ్యమైన కుడి భాగముగా ఆచార్యుడు చెప్పబడినాడు.
సహస్ర తర్క జ్ఞాన దాయక! ।
త్వం సహస్రార పరమ శివః ॥
నీవే పరమశివునిగా పిలువబడే అత్యుత్కృష్టమైన భగవంతుడవు. వెన్నుపూస (మేరువు) యొక్క అగ్రభాగమైన శిరస్సులోసున్న మస్తిష్కమందు న్నటువంటి సహస్రార చక్రము మధ్యలో నీవు నెలకొని ఉంటావు. సహస్రార చక్రము బుద్ధికి ప్రాతినిధ్యం వహిస్తూ వేయి దళములు గల పద్మముగా చిత్రీకరించబడుతుంది. వేయి తార్కిక వాదనలతో (వేయి పద్మ దళములు) కూడిన (లాక్షణికమైన అర్థము) యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించే సద్గురుడవు నీవేనని ఇక్కడ అర్థం చేసుకోవాలి.
కుండలినీ తు పరా ప్రకృతిరహమ్ ।
మూలే తమసా శక్తి వీచిః ॥
చైతన్యరూపమైన (సత్త్వము) నా జీవాత్మ పరాప్రకృతియని చెప్పబడుతుంది. ఇది కేవలము రూపాంతరము చెందిన శక్తిరూపము (రజస్సు) మరియు ఈ శక్తి తరంగరూపములో సర్పము వలె ప్రయాణిస్తుంది. కాబట్టి, సర్పాకార గమనము కలిగిన ఈ చైతన్యము కుండలిని అనే పేరుతో కూడ పిలువబడుతుంది. ఈ కుండలిని మేల్కొనే ముందు అన్నిటికన్నా దిగువన ఉన్న మూలాధారముగా పిలువబడే చక్రమందు ఘనీభూతమై (తమస్సుగా) నిద్రాణ స్థితిలో ఉంటుంది.
సత్త్వము, రజస్సు మరియు తమస్సు అని ప్రాథమికమైన గుణములుగా చెప్పబడతాయి. సమస్త సృష్టికి ఈ మూడు గుణములు అవిభాజ్య అంగములు. సత్త్వము అంటే చైతన్యము. చైతన్యము జడశక్తి యొక్క ఒక కార్యరూపము. జడశక్తి చైతన్యముగా రూపాంతరం చెంది క్రియాత్మకమైన మస్తిష్కము (brain) మరియు నాడీవ్యవస్థగా (nervous system) మారుతుంది. రజస్సు అనగా జడశక్తియే. విజ్ఞానశాస్త్ర పరంగా, అటువంటి శక్తి లెక్కించబడి వేరుగా ఉండే చిన్న చిన్న సంచులను కలిగియుంటుంది (Energy is quantized, which means that it is composed of small separate packets of energy.). నిజానికి రజస్సు అంటే కణములు (ధూళి కణములు – dust particles) అని, లెక్కించబడిన శక్తి యొక్క రూపములుగా వీటిని అర్థం చేసుకోవాలి. తమస్సు అనగా ఘన ద్రవ్యము (solid matter), జడశక్తి యొక్క ఘనీభూతమైన ద్రవ్యముగా భావించాలి. అంటే ద్రవ్యము – శక్తి ఈ రెండిటి మధ్య పరస్పరము మార్చుకొనగలిగే అవకాశమున్నదని (interconvertible) తెలుస్తోంది. ఈ సందర్భములో, తమస్సు భౌతికమైన నాడీవ్యవస్థగా పేర్కొనడం వలన జడశక్తి నాడీవ్యవస్థలో చైతన్యముగా రూపాంతరం చెందుతోంది. కుండలిని మేల్కొనడమంటే క్రియాత్మకమైన నాడీవ్యవస్థలో (matter – ద్రవ్యము, tamas – తమస్సు) జడశక్తి (రజస్సు) రూపాంతరం చెంది కేవలం చైతన్యం (సత్త్వము) ఉత్పత్తి కావడమే.
సంసార బంధ చక్ర షట్కే ।
తవ బంధాత్ గలితే స యోగః ॥
ఆరు దిగువన ఉన్న చక్రములు ఆరు ప్రధానమైన ప్రాపంచిక బంధములను సూచిస్తాయి. ఎపుడైతే జీవుడు ఈ ప్రాపంచిక బంధాలన్నింటినీ దాటుకొని యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సద్గురువుని – అనగా సమకాలీన నరావతారాన్ని చేరతాడో ఆ అదృష్టరూపమైన కలయిక ద్వారా, అపుడు ఆ జీవుడు యోగాన్ని పొందుతాడు.
నిజానికి, లోకంలో చిత్రీకరించిన విధంగా మానవ శరీరంలో సహస్రారము-ఆరు చక్రములు-కుండలిని అనేవి ఉండవు. అలా చెప్పడం కేవలం ఒక సారూప్యత (analogy)ను చూపి తద్ద్వారా జీవుడు అన్నిరకముల ప్రాపంచికమైన ఆకర్షణలను దాటి సద్గురువును చేరతాడని చెప్పడం కొరకే. మేరువుగా చెప్పబడే వెన్నుపూస (spinal cord) పై ఈ ముందు చెప్పిన చక్రములన్నియు చిత్రరూపంలో ప్రస్తుతీకరించబడినవి. ఎందువలననంటే, ఈ ప్రాపంచిక ఆకర్షణలన్నీమేరువు ద్వారా ప్రవహించే చైతన్యం యొక్క కేవలం వివిధములైన రీతులు (modes) మాత్రమే. వేయి దళములు కలిగినదిగా చెప్పబడే సహస్రారము వెన్ను యొక్క అత్యున్నత స్థానమైన మస్తిష్కమందు ఉన్నట్లుగా చెప్పబడినది. సద్గురువుచే చెప్పబడిన ఆధ్యాత్మిక జ్ఞానమును తెలుసుకొనుటకు అవసరమైన బుద్ధికి (intelligence) ఈ స హస్రారము ప్రాతినిధ్యం వహిస్తుంది.
మూలాధార చక్రమందు నిద్రిస్తున్న కుండలిని మనస్సు తప్ప వేరొకటి కాదు. ఇది చైతన్యము లేక జీవుని యొక్క అంతఃకరణములోని దిగువ తరగతికి చెందిన విభాగమై ఉంటుంది. కుండలిని నిద్రించడమంటే మనస్సు అజ్ఞానముతో కప్పబడి ఉన్నదని అర్థము. ఈ అజ్ఞాన ఫలితముగా, ప్రపంచములోని ఆకర్షణలు మనస్సును నియంత్రిస్తాయి. ఘన ద్రవ్యము లేక పృథివీ రూపమైన స్వభావము కలిగిన మనస్సుకు, మూలాధార చక్రములో అది నిద్రిస్తుంది అని చెప్పడం ద్వారా ముందు చెప్పిన విషయము నిరూపించబడినది.