home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

అదిగో శేషాద్రి ! మందిరమదిగో చూడండీ


అదిగో శేషాద్రి ! మందిరమదిగో చూడండీ
అరవిందాక్షుడు పద్మా లోలుడు అతడే నండీ | (పల్లవి)

1.  మానవ జన్మము నెత్తినందులకు సార్ధకమయ్యెను వెంకన్నా |
నీ పై పాటల వ్రాసితినందురు - వ్రాసిన వాడవు నీ వన్నా |
పద్మగ నీవె పుట్టితివిచ్చట తియ్యగ పాడితి ఓరన్నా |
పద్మారమణా ! ఆనందముతో కీర్తినిచ్చితివి నాకన్నా ||

2.  మేడలు రూకలు బంధము లేవియు నా వెంట రావు వెంకన్నా |
ఈ పాటలనెడి దివ్య సంపదయె మము రక్షించును కొండన్నా |
నర జన్మమునిటు నీ గానమునిటు దయసేయుమెపుడు దత్తన్నా |
ఇంతకన్న వరమేమియు అడుగను కాదన బోకుము హరియన్నా ||

3.  స్వర్గాధిపతియు వీటిని వినగా పరుగెత్తు చుండు నోరన్నా |
వీటిని పాడెడి నారదుడయ్యెను త్రిభువన పూజ్యుడు ఓ కన్నా |
గీతామృతమును త్రాగెడివానికి బ్రహ్మానందము చాలన్నా |
యమకింకరులను పొమ్మని వత్తురు విష్ణుదూతలు చివరోయన్నా ||

4.  నీ పాట పాడ బాష్పలోచనము లొప్పగ విందురు వారన్నా |
భక్తి లేక వృధ పూజలు జపములు ప్రేమయె మార్గము ఓరన్నా |
అహంకారమున పాపాత్ముడనై పతితుడనైతిని వెంకన్నా |
పండిత వేషము పామరాధముడ ఉద్ధరించుమిక దత్తన్నా ||

5.  వేద శాస్త్రముల చదివితి నేనని గర్వమెక్కెనిల నాకన్నా |
పద్మను గురువుగ చూపితి విచ్చట భక్తి మార్గమున హరియన్నా |
ఙ్ఞానమె దీపము భక్తియె మార్గము నీ దయ నడవగ ఊపన్నా |
దీప హీనుడును మార్గమునందున లక్ష్యము చేరును వెంకన్నా ||

6.  నీ అందాలను పొందు పరచినవి పాటల విందులు చాలన్నా |
ఆకలి దప్పిక నిద్రయు లేవిట అమరుడ నైతిని వెంకన్నా |
అన్నమయ్య ఇటు పద్మయు అన్నా చెల్లెళ్ళ కివియె నతులన్నా |
నీ కర ఖడ్గము నీ కర పద్మము వారిరివురు గద వెంకన్నా ||

 
 whatsnewContactSearch