home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

వెంకటేశ్వరుడు - ఎంగిలి చేసిన


వెంకటేశ్వరుడు - ఎంగిలి చేసిన
తిరుపతి లడ్డును - తిందాము రారె || (పల్లవి)

1.  భక్తియె చక్కెర - ఙ్ఞానమె  బూందియు - శ్రద్ధయె ఏలా ఫలముల పలుకులు |
ప్రపత్తి తలపులె ఎండిన ద్రాక్షలు - శరణాగతియే పచ్చకప్పురము ||

2.  పద్మావతియే స్వయముగ చేసిన - పెద్ద పెద్దవవి లడ్డులు చూడరె |
మధ్య మధ్యలో సత్సంగములను - చర్చల వడలను నంచుక తినుచును ||

3.  భక్తి రసామృత మాధుర్యమయము - ఎన్ని తిన్ననూ రోగము కానిది |
స్వామి ప్రేమలను లడ్డుల తినవే - ఆ లడ్డులన్ని వ్యాపారములే ||

4.  ఙ్ఞానవహ్నితో వండిన వంటలు - ఎప్పటి కప్పుడు వేడి వేడివవి |
భక్తి గీతములె జీడిపప్పులే - రుచికరములవియె తినవే పద్మా ||

5.  అంతరార్ధమును తెలియని వారలు - శాశ్వత నష్టము పొందెదరవనిని |
దిగి దిగి వచ్చిన అవతారములే - తిరుపతి లడ్డులు ప్రసాదములవియె ||

 
 whatsnewContactSearch