(శ్రీ దత్త భగవానుని ధ్యైర్యగుణమే హనుమంతులవారు. హనుమంతులవారు అనేక సాహసోపేతమైన కృత్యములు చేయటం - ఎన్నెన్నో సంకటాల నుండి భక్తులను రక్షించటం - జగత్తులో అందరికి తెల్సిన సత్యమే కదా! శ్రీ దత్త హనుమానులను స్వామి ఈ విధంగా కీర్తించారు).
శ్రీదత్త హనుమదీశ్వరం | ధ్యాయామి రఘుపతి ప్రియమ్ |
ప్రజ్ఞాని భక్త యోగినం | పావనిం పరమ పావనమ్ || (పల్లవి)
1. అన్నా ! అన్నా ! ఓ హనుమన్నా ! | పాపములెన్నో చేసితినన్నా ! |
దయతో నీవె క్షమించకున్న | దిక్కులేదు నా సాధన సున్న ! ||
2. ఇంద్రియ నిగ్రహమసలే లేదు | నీకు తమ్ముడని చెప్పుట సిగ్గు ! |
నిష్కామ సేవ కలలో మాట | అదియే గద నిత్యము నీబాట ||
3. పరమవావనా ! పవన కుమారా ! | రుద్రావతారా ! నిర్జిత మారా ! |
వీరాధివీర ! వేదార్ధసారా ! ఖల సంహారా! గిరి సంచారా ! ||