home
Shri Datta Swami

Jump to Bhakti Ganga contents in — English  Telugu  Hindi

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


(శివ పంచాక్షరీ మహిమ వర్ణనము.)
ఓం నమః శివాయ ఓం నమః శివాయ |
పంచాక్షరి యిది పరమ పావనము || (పల్లవి)

1. పంచభూతములపై ఆధిపత్యమును - ప్రసాదించగల మహామంత్రము |
సుందర కవితా చాతుర్యరీతి - ననుగ్రహించెడి మహా మంత్రము ||

2. వేదాంత జలధి మధనామృతమగు - ఙ్ఞానమునిచ్చెడి మహామంత్రము |
సర్వ విక్షోభ ప్రశమన కరమై - మనశ్శాంతినిడు మహామంత్రము

3. అష్టసిద్ధులను అవలీలగాజేయు - శక్తినిచ్చెడి మహామంత్రము |
చక్రాలదాటి సహస్రారమున - శివునిఁ జేర్చెడి మహామంత్రము ||

4. ఆదిదేవుని అంఘ్రి పద్మముల - భక్తి నొసగెడి మహామంత్రము |
నిష్టానిశ్చల యమనియమాసన - ధ్యానయోగకర మహామంత్రము ||

5. సంసారవాసనా విషయధ్వంసక - కామదహనమీ మహామంత్రము |
అనన్యమద్భుత వైరాగ్యమిచ్చు - సర్వ పాపహర మహామంత్రము ||

 
 whatsnewContactSearch