home
Shri Datta Swami

 23 Jan 2025

 

English »   Malayalam »  

Bhulokam Bittaroda - Telugu song composed by Shri Datta Swami

భూలోకం బిత్తరోడా

Bhulokam Bittaroda

(శ్రీశ్రీశ్రీ దత్తస్వామివారు రచించిన తెలుగు జానపద గీతం. English translation follows.)


(Sung by Ms. Laxmi Thrylokya)

చుట్టుముట్టి సూర్య లోకం
నట్టనడుమ నరక లోకం

Surrounded by the world of the sun
In the middle lies the world of hell

నీవుండేది మర్త్య లోకం
దాని పక్కన ప్రేత లోకం

The world you stay is the world of mortals
Adjacent to it is the world of dead

ప్రేత లోకం దాటగానే
ప్రేత లోకం దాటగానే

After crossing the world of dead
After crossing the world of dead

నీ తోలు తీస్తం కొడకో
భూలోకం బిత్తరోడా.

O bastard son! Your skin will be peeled off
O cheating sinner of the Earth!

Swami

శ్రీ దత్తస్వామివారు రచించిన ఈ పాట తెలంగాణా జానపద గీతం 'నైజాము సర్కరోడా' యొక్క రాగంలో పాడబడినది. దత్త దేవుని సంకల్పంతో ఆశువుగా స్వామివారు ఈ పాటను పాడినారు. భూలోకంలో ఉన్న పాపులను చూస్తూ ఈ పాటను యమభటులు పాడతారు అని హాస్యాస్పదంగా అన్నారు. స్వామివారి హాస్యంలో కూడా బ్రహ్మజ్ఞానమే ఉంటుందని భక్తులందరికీ తెలుసు. ఇక్కడ 'బిత్తరోడా' అంటే 'మోసగాడా' అని అర్థం. ఎవరైతే ఇతరులను మోసం చేస్తూ బ్రతుకుతారో, వారు మరణం తరువాత నరక లోకంలో తీవ్రమైన శిక్షలు అనుభవిస్తారు. మరణానంతరం జీవుడు ప్రేతలోకానికి చేరుకుంటాడు. పది రోజుల పాటు భగవంతుడు ఆ జీవుని కర్మలను విచారించి నరకానికి లేదా స్వర్గానికి లేదా పితృలోకానికి పంపిస్తారు. భక్త జీవులకు మాత్రం ప్రేతలోకంలో విచారణ ఉండదు. వారు మరణానంతరం నేరుగా దైవ సన్నిధికే చేరుకుంటారు. మానవ శరీరంలో ఉన్న జీవుడు కఠిన శిక్షలు అనుభవవించలేడు. ఎందుకనగా మానవ శరీరం అధిక బాధను తట్టుకోలేదు. కానీ నరక లోకంలో జీవునికి 'యాతనా శరీరం' ఇవ్వబడుతుంది కనుక ఎన్ని కఠిన శిక్షలు వేసినా ప్రాణం పోదు. ఈ పాట ద్వారా స్వామివారు మనకు పాపం చేయవద్దు అనే సందేశాన్ని ఇస్తున్నారు. భగవంతుని సృష్టిలో అధర్మానికి చోటులేదు గనుక మనం చేసిన ప్రతి కర్మకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. శ్రీ దత్తస్వామి వారి కృపతో పాప రహితమైన మానవ జీవితాన్ని గడుపుదాం. జై శ్రీ దత్తస్వామి!

This song, composed by Shri Datta Swami, is sung in the tune (Raaga) of the Telangana folk song 'Naijaamu Sarkaroda'. This song was sung by Swami spontaneously due to the will of God Datta. Swami jokingly said that the soldiers of Yama sing this song looking at all sinners existing on earth. All the devotees know that there is divine knowledge (Brahma Jnaana) even in Swami's humour. Here, the word 'bittaroda' used in Telugu means 'cheating sinner'. Those, who lead the life of deceiving others will suffer severe punishments in the world of hell after death. After death, the individual soul (Jiiva) reaches the world of the dead (Preta Loka) from the world of mortals (Earth or Martya Loka). For ten days, the Lord carries out the inquiry about the deeds done by the soul (Jiiva) and sends him to hell or heaven or Pitru Loka. For devoted souls, there will not be any trial in the world of the dead since they go directly to the abode of God after death. An individual soul in a human body cannot experience harsh punishments because the human body cannot withstand huge pain. But in hell, the living being is given the 'energetic body of sufferance' and hence, no matter how many severe punishments are given, the life will not be lost. Swami is giving us a message that ‘we should not sin’ through this song. Since there is no place for injustice in God's creation, we must undergo the fruit for every deed we do. Let us lead a sinless human life by the grace of Shri Datta Swami. Jai Shri Datta Swami.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch