home
Shri Datta Swami

 25 Jan 2025

 

English »   Malayalam »  

Prapancha Sarkaroda - Telugu folk song composed by Shri Datta Swami

ప్రపంచ సర్కరోడా

Prapancha Sarkaroda

(శ్రీశ్రీశ్రీ దత్తస్వామివారు రచించిన తెలుగు జానపద గీతం. English translation follows)


(Sung by Ms. Laxmi Thrylokya)

బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి

Cart behind cart arranged
Arranging sixteen carts

నీ గుడికి వస్తం దత్తుడో
ప్రపంచ సర్కరోడా

Will come to Your temple O Datta
The ruler of the world.

బమ్మి వాగు తుమ్మి వాగు
చంద్ర వాగు సంగమాన

Stream of Bammi Stream of Tummi
Stream of Candra at their confluence

నీ గుడికి వస్తం దత్తుడో
ప్రపంచ సర్కరోడా

Will come to Your temple O Datta
The ruler of the world.

ఎత్తిపోతల కొండ మీద
ఎత్తిపోతల కొండ మీద

On the hill of Ettipotala
On the hill of Ettipotala

నీ గుడికి వస్తం దత్తుడో
ప్రపంచ సర్కరోడా.

Will come to Your temple O Datta
The ruler of the world.

Swami

శ్రీ దత్తస్వామివారు రచించిన ఈ పాట తెలంగాణా జానపద గీతం 'నైజాము సర్కరోడా' యొక్క రాగములో పాడబడినది. ఎత్తిపోతల కొండ మీద ప్రాచీన దత్తాత్రేయ దేవాలయము ఉన్నది. నిజానికి ‘యతితపఃస్థల’ అన్న పేరు ‘ఎత్తిపోతల’గా ఇప్పుడు పిలువబడుతోంది. యతి అనగా ఋషి. యతితపఃస్థల అనగా ఋషులు తపస్సు చేసే చోటు అని అర్థము. శ్రీ దత్తస్వామి వారు యతితపఃస్థలంలో మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని దత్తుని కోసం తపస్సు చేసినారు. నాలుగవ రోజున దత్తుడు ప్రత్యక్షమయి స్వామివారితో సంభాషించినారు. వారి మధ్య జరిగిన దివ్య సంభాషణ 'శ్రీ దత్తగురు భగవద్గీత' అనే పుస్తకంగా తెలుగులో మరియు ఆంగ్లంలో ప్రచురించబడినది. ఆ కొండ మీద నుండి మూడు వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. బమ్మి వాగు బ్రహ్మకు ప్రతీక. తుమ్మి వాగు విష్ణువుకు ప్రతీక. చంద్ర వాగు శివునికి ప్రతీక. తుమ్మ చెట్టు నల్లగా ఉండును కావున విష్ణువుకు ప్రతీక. చంద్రుడు తెల్లగా ఉండును కావున శివునికి ప్రతీక. ‘నైజాము సర్కరోడా’ అనగా నిజాం రాజ్యమును పాలించు ప్రభువు అని అర్థము. అలానే ‘ప్రపంచ సర్కరోడా’ అనగా ప్రపంచమును పాలించు ప్రభువు దత్తుడు అని అర్థము. దత్తుడు త్రిమూర్తులకు మూలము అని తెలుపుతూ ఈ మూడు వాగుల సంగమము వద్దనే దత్తదేవుని గుడి ఉంటుంది. స్వామివారు రచించిన ఈ పాట అన్ని దైవ రూపాలకు మూల విరాడ్రూపమైన దత్తుని పూజించమని భక్తులకు సూచిస్తున్నది. జై శ్రీ దత్తస్వామి!

This song, composed by Shri Datta Swami, is sung in the tune (Raaga) of the Telangana folk song ‘Naizaamu Sarkaroda’. There is an ancient Dattatreya temple on the hill of Ettipotala. Actually, the name ‘Yatitapahsthala’ is now known as ‘Ettipotala’. Yati means sage. Yatitapahsthala means a place, where sages do penance. Shri Datta Swami did penance for Lord Datta by abstaining from food and sleep for three days at this Yatitapahsthala. On the fourth day, God Datta appeared and had conversation with Swami. The divine discussion between them has been published as a book titled 'Shri Dattaguru Bhagavad Gita' in Telugu and English. Three streams flow from the hill. The stream of Bammi symbolizes Brahma. The stream of Tummi is a symbol of Vishnu. The stream of Chandra is symbolic of Lord Shiva. Tumma tree is black and so is a symbol of Lord Vishnu. The moon is white and so it symbolizes Lord Shiva. 'Naizaamu Sarkaroda' means the ruler of the kingdom of Nizam. Similarly, 'Prapamcha Sarkaroda' means the ruler of the world, who is Lord Datta. The temple of God Datta is located at the confluence of these three rivers, stating that God Datta is the root of the Trinity (Trimurtis). This song composed by Swami indicates the devotees to worship God Datta, who is the root form of all the divine forms. Jai Shri Datta Swami!

 

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch