08 Mar 2022
జీవులు ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవితాన్ని గడపాలని ఆలోచిస్తున్నారు. కళాశాలలో చేర్పించిన తమ కుమారుడు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించి, పూర్తి స్వేచ్ఛగా జీవించినట్లైతే అప్పుడు వారే వానిని హెచ్చరిస్తారు. విద్యార్థి తన కళాశాల జీవిత లక్ష్యాన్ని అనగా డిగ్రీ పొందడమును గ్రహించినట్లే, ప్రతి ఒక్కరూ మానవ జీవిత లక్ష్యాన్ని గ్రహించాలి. ఇది ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవించడము కాదు. అదే సత్యమైతే ఎలాంటి బాధ్యత లేకుండా పూర్తి ప్రశాంతతతో కాలేజీ హాస్టల్‌లో జీవిస్తున్న విద్యార్థిని కూడా అభినందించాల్సిందే కదా! మీరు మానవ జీవిత లక్ష్యాన్ని గ్రహించలేకపోయినట్లైతే, దాని అర్ధము మానవ జీవితానికి లక్ష్యము లేదని కాదు కదా!
దురదృష్టవశాత్తూ, ప్రస్తుత కాలంలో, అనేకమంది ఆధునిక ఆధ్యాత్మిక గురువులు కూడా జీవితంలో ఎటువంటి లక్ష్యము లేకుండా పూర్తి స్వేచ్ఛగా జీవించడము అనే దృక్కోణానికే మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత కాలంలో భగవంతుని అస్తిత్వము మరియు ఆయన అనుగ్రహమును పొందుటకు మానవ జీవితములో చేయవలసిన కృషిని ఈ గురువులు పూర్తిగా నాశనము చేసినారు. మానవ జీవితము యొక్క నిజమైన లక్ష్యాన్ని గుర్తించే మొదటి ప్రయత్నమే లేనప్పుడు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కృషి చేయడము గురించి ఏమి మాట్లాడగలము?
స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవితాన్ని గడపటమే అంతిమమని బోధిస్తున్న ఈ ఆధునిక ఆధ్యాత్మిక గురువులు తమ పిల్లలకు ఐఏఎస్ (IAS) పరీక్షల కోసం బోధించే విద్యాలయాలలో చేర్చిన తరువాత పరీక్ష-ఉత్తీర్ణత అనే లక్ష్యాన్ని వదలివేసి, పూర్తి స్వేచ్ఛతో హాస్టల్‌లో జీవించమని సలహా ఇవ్వాలి, ఎందుకంటే వారు అదే జ్ఞానమును సమాజానికి బోధిస్తున్నారు కదా! అదేవిధంగా, అద్వైత వేదాంతులు తమ పిల్లలను ఐఎఎస్ పరీక్ష చదవకున్నా కూడా అప్పటికే జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్నట్లుగా భావించాలని సలహా ఇవ్వవలెను, ఎందుకంటే ఈ వేదాంతులు సాధనకు ముందే తాము భగవంతుడనని భావిస్తున్నారు కదా! కాబట్టి ఈ రెండు సందర్భాలలోను పేర్కొనబడినవారు తమకు ఏ విధమైన బాధ్యత లేదని భావించి సంతోషంగా జీవించవచ్చును, ఎందుకనగా వారికి వారే లక్ష్యమైనందున వారు ఇప్పటికే లక్ష్యాన్ని చేరినారు కదా! లక్ష్యాన్ని కష్టపడి సాధించిన వాళ్ళు విజయముతో ఆనందంగా జీవిస్తూంటే, అసలు లక్ష్యాన్నే సాధించకుండా తాము సాధించినట్లు ఊహలలో ఉన్న ఈ విద్యార్థులు కూడా అదే ఆనందముతో జీవించవచ్చును! లౌకిక వ్యవహారాలలో, ఈ రెండు రకాల ఆనందాలు (సత్యమైనది మరియు ఊహాత్మకమైనది) ఒక్కటిగా ఉండే అవకాశం ఉన్నది (రెండూ సాపేక్ష సత్యాలు కాబట్టి), కానీ భగవంతుని పొందే విషయంలో ఈ రెండు రకాల ఆనందాలు చాలా భిన్నమైనవి. ఎందుకనగా సత్యము ఎప్పుడూ సత్యమే (సంపూర్ణ సత్యము) మరియు ఊహ ఎప్పుడూ ఊహే (సాపేక్ష సత్యము). మనస్తత్త్వశాస్త్రము యొక్క లక్ష్యము నిరంతర ప్రయత్నములోని ఒత్తిడిని ఎల్లప్పుడునూ నివారించడమే. లక్ష్యాన్ని సాధించకుండా సాధించామనే భావన ఈ సమస్యను మూలం నుండి పరిష్కరిస్తుంది! ఇటువంటి జనుల మనస్తత్వమును ఈ గురువులు తమ దోపిడికి ఉపయోగించుకుంటున్నారు!
ఈ మానవజన్మ యొక్క లక్ష్యాన్ని గుర్తించే మొదటి అడుగు వేయుటకు, భగవంతుడు, స్వర్గము మరియు నరకముల యొక్క అస్తిత్వమునకు 50:50 ఉండే అవకాశమును గురించి ఆలోచించాలి. విశ్వమంతయు ఎవరూ ప్రయాణించనందున, భగవంతుడు ఉండుటకు మరియు లేకపోవుటకు సమాన అవకాశము కలదు. సమాన అవకాశము ఉన్న అటువంటి పరిస్థితులలో, సురక్షితమైన అవకాశమును తప్పనిసరిగా ఎంచుకొనవలెను. భగవంతుడు మరియు నరకము లేవని భావించి, భగవంతుణ్ణి నమ్మకుండా పాపాలు చేస్తూ పోతే, యాదృచ్ఛికంగా భగవంతుడు మరియు నరకము ఉన్నట్లయితే, కష్టముల పాలగుదుము గదా! భగవంతుడు మరియు నరకము యొక్క ఉనికిని విశ్వసించి, పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గంలో జీవించినట్లయితే అవి లేకపోయినా, ఏ విధమైన నష్టము కలుగదు. భగవంతుడు మరియు నరకము లేనప్పటికీ, జీవితములో అద్భుతమైన అదనపు ప్రయోజనము కూడా కలదు. అదేమనగా భవిష్యత్తులో ఈ లోకములో లేదా నరకములో (ఒకవేళ నరకము ఉంటే) సంభవించే శిక్షల గురించి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా శాంతియుతంగా జీవించవచ్చును. ఈ విధంగా, భగవంతుడు మరియు నరకము యొక్క ఉనికికి సంబంధించి ఏది సత్యమైనా, ఆయనపై విశ్వాసంతో ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించుటయే చాలా చాలా ఉత్తమము.
పైన పేర్కొన్న 50-50 అవకాశము ఆధారంగా మాత్రమే మనము ఆధ్యాత్మిక మార్గమును అనుసరించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక జీవితానికి మాత్రమే అనుకూలంగా ఉండే 100% పరిపూర్ణ అవకాశమును కూడా మనము కనుగొనవచ్చును. నేను మీకు నరకమును చూపించలేనని వాదించనవసరం లేదు ఏలననగా, మీరు కూడా నరకం లేకపోవడాన్ని చూపించలేకపోతున్నారు గదా. ఎందుకంటే మన ఇద్దరికీ ఈ విశ్వము అనంతమైనది. ఈ సందర్భంలో కూడా, పైన పేర్కొన్న 50:50 అవకాశము ఉండనే ఉన్నది. అందువలన, భగవంతుని ఉనికిని ఖచ్చితముగా తెలుసుకొనడము ఎల్లప్పుడూ మంచిది. ఈ ప్రపంచంలో అనేక మహిమలు జరుగుతున్నాయి, అవి మన కంటితో మనము చూచుటకు అందుబాటులో కలవు. ఉదాహరణకు, మీరు YouTube లో వీడియోలను వెతికితే, సత్యనారాయణ బాబా అనే వ్యక్తి, గత 23 సంవత్సరాలుగా ఆహారము మరియు నీరు లేకుండా ఒకే చోట కూర్చున్నట్లు తెలుసుకొనవచ్చును. చాలా మంది అతని చుట్టూ ఎప్పుడూ ఉంటారు. ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాకు సమీపంలో ఉన్నారు. మీరు Google లో ఆయన గురించి సులభముగా తెలుసుకొనవచ్చును. ఎందుకు మీరు అక్కడికి వెళ్లి ఆయనను నిశితముగా పరిశీలించకూడదు? తద్వారా మీరు ఊహాతీతమైన శక్తి యొక్క ఉనికిని మరియు ఊహాతీత భగవంతుడు (పరబ్రహ్మము) అట్టి శక్తిని కలిగి ఉన్నారని మీరు ఖచ్చితంగా విశ్వసించవలసి వస్తుంది. ఆయనే మహిమలు అని పిలువబడే అనూహ్యమైన సంఘటనలకు కారణము. శ్రీ సత్యసాయి బాబా బహిరంగంగా ప్రదర్శించిన మహిమలు ఉన్న అనేక వీడియోలు కూడా భగవంతుని ఉనికినే ఖచ్చితంగా సూచిస్తున్నాయి. ఈ ప్రపంచంలో తరచుగా అగుపించే పునర్జన్మ యొక్క నిజమైన సంఘటనలు మరియు కొంతమంది వ్యక్తుల మరణానంతర అనుభవములు కూడా ఈ భగవంతుని ఉనికినే నిరూపిస్తున్నాయి.
పై విశ్లేషణ ద్వారా, ఊహాతీత భగవంతుడున్నాడని నమ్మే స్థితికి మీరు రావచ్చును. ఇప్పుడు, ఆకాశమునకు (space), కాలమునకు (time) అతీతమైన ఊహాతీత భగవంతుడు నిజంగా ఉన్నాడని మరియు మనము తార్కిక వివరణ ఇవ్వలేని మహిమలు అని పిలువబడే అనూహ్యమైన సంఘటనలకు నిజమైన కారణము ఈయనే అని మీరు గ్రహించగలరు. ఈ జీవులందరికీ సృష్టికర్త అయిన భగవంతుడే అసలైన తండ్రి. ఆయన ఎల్లప్పుడూ జీవులను సత్యమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ప్రయత్నించును. భగవంతుడు ఈ లోకములో మహిమలను ప్రదర్శించడానికి ఇదే ప్రధాన కారణము. దీనిని తెలుసుకొనుట ద్వారా, మీరు మానవ జీవితము యొక్క సత్యమైన లక్ష్యాన్ని గుర్తించగలుగుతారు. ఇప్పుడు మీరు భగవంతుని అనుగ్రహాన్ని పొందుటకు సత్యమైన ఆధ్యాత్మిక మార్గములో పయనించవలెను.
భగవంతుణ్ణి ఏ విధమైన లాభాపేక్ష మార్గము ద్వారా చిక్కించుకొనలేము. ప్రతిఫలాపేక్ష లేని సత్యమైన ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుడిని చిక్కించుకొనగలము. సత్యమైన ప్రేమ అంటే భగవంతుని నుండి ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా భావరూప మరియు క్రియాశీల మార్గాలలో భగవంతుని కొరకు త్యాగము చేయుట. మీరు డివైడర్‌తో విభజించబడిన రహదారిని తీసుకుంటే, ఒక సగ భాగములో ట్రాఫిక్ ఒక వైపు నుండి మరొక వైపునకు మరియు మరొక సగ భాగంలో దీనికి వ్యతిరేకదిశలో ట్రాఫిక్ ఉండును. రోడ్డు యొక్క ఒకే భాగంలో ఒకే సమయంలో రెండు వైపుల నుండి ట్రాఫిక్ ఉండదు. దీని అర్థము, మీరు భగవంతుని నుండి ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా రహదారి యొక్క సగ భాగంలో వన్ వే ట్రాఫిక్ లాగా భగవంతునికి సేవ చేస్తున్నప్పుడు, అదే సమయంలో మరొక వైపు వ్యతిరేకదిశలో జరిగే వన్ వే ట్రాఫిక్‌లాగా భగవంతుడు కూడా మీకు సహజంగా సహాయము చేయు అవకాశము ఉండదు. దీని అర్ధము ఏమిటంటే, మీరు సత్యమైన ప్రేమతో మరియు ఏ విధమైన వ్యాపార దృక్పధము లేకుండా భగవంతునికి సేవ చేయాలి. అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా అదే సత్యమైన ప్రేమతో మరియు వ్యాపార దృక్పధము లేకుండా మీకు మరో సమయంలో (నిజమైన అవసరము వచ్చినప్పుడు) సహాయము చేయును. అనగా ఎటువంటి లెక్కలు లేకుండానే మీకు భగవంతుని సహాయము అందుతుందని దీని అర్థము. జీవుడు సర్వశక్తిమంతుడు కానందున వ్యాపారము యొక్క ప్రభావము జీవుల విషయంలో ఉండవచ్చును మరియు భగత్సేవ కారణంగా అతను/ఆమె సర్వం కోల్పోవచ్చునని భయపడవచ్చును. భగవంతుడు అలా భయపడనవసరం లేదు. ఎందుకనగా భగవంతుడు మహా మహిమాన్వితమైన సర్వశక్తిమంతుడు కావున అనంతమైన సంపదను కలిగియున్నాడు. భగవంతుని స్వభావాన్ని అర్థము చేసుకున్నప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడైన కారణంగా అసాధ్యమైన కార్యమును కూడా తన సంకల్పముతో చేయగలడు, కాన, భగవంతుని అనుమానించాల్సిన అవసరం ఏమిటి? ఒకరు తన స్వలాభము కొరకు మరొకరిని మోసగిస్తారు. భగవంతునికి ఏ విధమైన లాభము అవసరము లేదు కావున ఎవరినీ మోసగించవలసిన అవసరము లేదు. అలాంటి సందర్భంలో, జీవులకు భగవంతునిపై పూర్తి విశ్వాసము ఏల లేదు? జీవుడు ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా భగవంతుడిని సేవిస్తే, తద్ద్వారా జీవుడు ఎటువంటి లెక్కలు లేకుండా భగవంతుని శాశ్వతమైన అనుగ్రహమును పొందగలడు.
జీవుడు ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించిన తర్వాత, ఏ నిర్దిష్ట మతమును గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు, ఎందుకంటే అన్ని మతాలలోనూ భగవంతుడు, స్వర్గము మరియు నరకము అనే మూడు (త్రయం) చాలా ముఖ్యమైన అంశాలుగా సమానముగానే ఉన్నాయి. ఈ మూడు తప్ప, ఇతర మతపరమైన వివరాలు ఆధ్యాత్మికానికి అవసరము లేదు. ఊహాతీతుడైన ఒకే భగవంతునికి వివిధములైన బాహ్య వేషములే. ఊహాతీతుడైన భగవంతుని మీద విశ్వాసమే ప్రాథమిక పునాది మరియు ఇది పూర్తి నివృత్తి లేదా ఆధ్యాత్మిక మార్గము. ప్రవృత్తి లేదా ప్రాపంచిక జీవితంలో, ఊహాతీతుడైన భగవంతుని బాహ్య ఆకారములు (కేవలము పూజించుటకు), న్యాయము లేదా స్వర్గానికి మద్దతు ఇవ్వడము, అన్యాయము లేదా నరకాన్ని వ్యతిరేకించడమే ప్రధానమని దీని మొత్తం సారాంశము. ఈ ప్రపంచంలోని ఏదైనా మతం మరియు ఆధ్యాత్మికత యొక్క సారాంశం మొత్తం ఈ మూడు అంశాలు మాత్రమే. అటువంటి సందర్భంలో, మతమును మన ఇష్టప్రకారముగా నిర్ణయించుకోవచ్చును కాబట్టి ఒకే నిర్దిష్ట మతమును అనుసరించాలనేది తప్పనిసరి కాదు. అయితే, ప్రతి మతములోనూ ఈ మూడూ సమానంగానే ఉన్నవి కావున, మతమార్పిడి కూడా వ్యర్థమే. ఈ విషయము ప్రపంచములో ఉన్న అన్ని మతాలలో సార్వత్రిక ఆధ్యాత్మికతను తీసుకురాగలదు, తద్ద్వారా ఏ మతం యొక్క ఆస్తికుడినైనా స్వాగతించవచ్చును. నాస్తికుడిది మాత్రమే దయనీయమైన స్థితి.
★ ★ ★ ★ ★