
శ్రీదత్తుడే త్రిమూర్తులుగా రూపొందినాడు. ఇది సృష్టికి పూర్వము జరిగినది. శ్రీదత్తుడు అత్రిమునికి ముందు త్రిమూర్తులుగా కనిపించి మరల ముగ్గురు ఏకము కాగా ఒకే మూర్తిగా కనిపించినాడు. ఇది ఒకటి, మూడైనదని చెప్పటమే తప్ప, మూడు ఒకటైనది కాదు. అనగా దత్తపరబ్రహ్మము "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ" కదా, కనుక ఏకస్వరూపము. ఈ ఏకస్వరూపము నుండే గుణ (సత్త్వ-రజ-స్తమస్సులు), కర్మల (సృష్టి, స్థితి, లయలు) వశం చేత త్రిమూర్తులకు...
[17.02.2008]
i) చెప్పిన జ్ఞానాన్ని విని ఇతరులకు అందించటం మాత్రమే కాదు మీరు కూడా మీ కష్టసుఖములకు ఈ జ్ఞానాన్ని సంపూర్ణముగా సమన్వయించుకొని ఆనందించాలే గాని కంటతడి పెట్టరాదు.
ii) జీవునిగా నీకు నీ శరీరములోనే ఉన్న గుండె, ఊపరితిత్తులు, మూత్రపిండాలు, అన్నకోశములను చూచావా? లేదే. మరి ఇదే కుదరనప్పుడు ఈ జన్మలోని మరియు గత జన్మలలోని వాసనలను నీవు ఎట్లు తెలుకొనగలవు?
iii) స్వామి సర్వాంతర్యామి. కర్మఫలప్రదాత. భేషజం...
శివలింగము, శక్తి యొక్క తరంగ స్వభావమును సూచించుచున్నది. శక్తి రూపములలో జడశక్తి రూపముల కన్నను చైతన్యశక్తి రూపమే గొప్పది. కావున శివలింగము చైతన్యశక్తినే సూచించుచున్నది. ఈ చైతన్యశక్తియే ప్రాణిస్వరూపము. అనగా ప్రాణులను సూచించుచున్నది. ఆ ప్రాణుల యందు వైశ్వానరాగ్ని స్వరూపమున ఉన్న జఠరాగ్నియే ఈ శివలింగము. కావున ఆకలిగొన్న పశుపక్ష్యాదులకున్నూ, అశక్తులైన...
[01.10.2003] పరబ్రహ్మము ఊహాతీతము (unimaginable). ఈ పరబ్రహ్మమును గుర్తించే స్వరూపలక్షణాన్ని (inherent characteristic) వేదము ఇలా చెప్పుచున్నది. దేని నుండి ఈ సమస్త భూతములు పుట్టి, దేని చేత నిలచి, దేని యందు లయము చెందుచున్నవో అదే పరబ్రహ్మము. అది ఏకైక స్వరూపము, అద్వితీయము. సర్వదేవతలు దత్తబ్రహ్మము యొక్క వేషములు మాత్రమే – "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ"...
స్వామి శ్రీమతి. శ్రీలక్ష్మి సంశయాలను క్రింది విధముగా నివృత్తి చేశారు.
[02.01.2004]
ప్రశ్న: i) పటములలో విగ్రహములలో దేవుడు లేడనియు, శిలావిగ్రహముల నారాధించు వారు శిలలైపోతారని మీరు చెప్పారు గదా. ఐతే మీరాబాయి శ్రీకృష్ణుని విగ్రహమును ఆరాధించి తరించలేదా?
స్వామి సమాధానము: 1) నీవు శిరిడిసాయి భక్తురాలవు. స్వామి అయిదవ దత్తావతారులు. ఆ రోజులలో సశరీరముగా నరావతారములో ఉండి జనులను ఉద్ధరించి తరువాత సమాధి అయినారు. ఇప్పుడు జనులు ఆయన శిలావిగ్రహము, పటములను పూజిస్తున్నారు. అట్లే నీవు కూడా ఈనాడు పటమును శిలావిగ్రహమును పూజిస్తున్నావు. కాని వర్తమానములో ఉన్న సాక్షాత్తు దత్తుని నరావతారమును గుర్తించకపోవటం...
Gems: r
r) పరిపూర్ణ ధర్మస్థాపన: ఈనాడు కేవలము నామ మాత్రముగా మత గ్రంథములపై ప్రమాణము చేయించి సాక్ష్యమును పలికించుటలో భగవంతుని సహాయము పూర్తిగా అర్థించబడుటలేదు. పరలోక రాజ్యమనగా భగవంతుడే న్యాయ నిర్ణేత, అధర్మ శిక్షకుడు అని అర్థము. కావున ప్రభుత్వ వ్యవస్థలో కాని, రాజకీయ వ్యవస్థలో కాని ఆధ్యాత్మికవిద్యను...
Gem: q
q) ప్రవృత్తి నివృత్తిలకు అవరోధము: ప్రవృత్తియను పాసు మార్కులు తెచ్చుకొనుటకు గాని, నివృత్తియను స్వర్ణపతకమును సాదించుకొనుటకు గాను అవరోధము విద్యార్థికి ఒక్కటే. అదియే సినిమాలపై ఆకర్షణము. ఇట్లే ప్రవృత్తులకు, నివృత్తులకు అడ్డముగా నిలుచు కారణము కూడ ఒక్కటే. అదియే ఏషణాత్రయము. మూడు బంధముల ఆకర్షణము – ధనేషణ, దారేషణ, పుత్రేషణ. చలనచిత్రములను చూచుటలో కొంత నిగ్రహము సంపాదించుకొన్నచో పాసుమార్కులు వచ్చును. అట్లే ఈ సంసార బంధముల...
Gems: p
p) నరావతారములో వచ్చి బ్రహ్మజ్ఞానమును బోధించు సద్గురువే పరమాత్మ: పరమాత్మ నరరూపములో వచ్చి పరమాత్మను గుర్తించు బ్రహ్మజ్ఞానమును బోధించునపుడు ఆ బోధకుడే పరమాత్మ అను విషయము నీకు స్పష్టమగును. పరమాత్మ కాని వాడు పరమాత్మను గురించి బోధించజాలడు. నన్ను నేను తప్ప ఎవడును తెలియజాలడని గీతావచనము - ‘మాం తు వేద న కశ్చన’. వేదములో కూడ బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మము తప్ప అన్యుడు కాడని వినబడుచున్నది...
Gems: o
o) నరావతారము: నరావతారమును గుర్తించుటకు కేవలము ఆ సద్గురువు బోధించు జ్ఞానమును పరిశీలించియే నిర్ణయించవలెను. ఆ జ్ఞానబోధలో సత్యములైన సమన్వయములు, స్పష్టముగా ఆత్మలోనికి దూసుకొని పోవు బోధన విధానము, అట్టి జ్ఞానము మరి ఏ ఇతర జీవులకు సాధ్యము...
Gems: m-n
m) జ్ఞానబోధ: ప్రకృతి నియమములను అనుసరించియే ఇట్లు జ్ఞానబోధను చేయుటకు అవకాశము ఉన్నప్పుడు పరమాత్మ దానిని ఉపయోగించుకొనును. ప్రకృతిసిద్ధముగా సులభముగా ఒక పనిని సాధించుకొనుట వివేకవంతుని లక్షణము. ఒక పని సులభముగా నెరవేరినపుడు దానిని కష్టసాధ్యమైన మార్గములో ఏల చేయవలయును? నీరు పంపు నుండి ధారాళముగా లభించునప్పుడు దానిని వదలి హైడ్రోజన్
Gems: f-l
f) రాధ: బృందావనములో రాధను మొట్ట మొదటి సారిగా రహస్యముగా వివాహమాడి ఎంతో ప్రాణాధికముగా ప్రేమించినాడు. కాని పెండ్లి అయిన రెండు సంవత్సరములలోనే బృందావనమును వదలి ఒక్కసారియైనను రాధను చూచుటకు రాక వేలకొలది స్త్రీలను వివాహమాడి ఆనందముతో యుండినాడు. ఇంత దుర్గుణ పరాకాష్ఠను ప్రదర్శించుటలో ప్రభువు యొక్క ఆంతర్యమేమి? ఇట్టి పరిస్థితిలో స్త్రీస్వభావసిద్ధమైన అసూయా గుణములు రాధకు ఎంతో రావలసియున్నవి. కాని ఆమె అణుమాత్రమైనను...
Gems: a to e
a) కృష్ణావతార రహస్యము: శ్రీకృష్ణుని స్మరించగానే ఆయనలో మనకు మూడు దోషములు వెంటనే గోచరించి ఆయన దైవత్వమును శంకించుటకు కాని లేక నిరాకరించుటకు కాని దోహదము చేయును. మానవునకు దోషదర్శనము చాలా శీఘ్రముగా కలుగుచున్నది. ఈ మూడు దోషములు ఏమనగా –
ఈ విషయములో ఇతర మతములు కూడా హిందూ మతమును తప్పు పట్టుచున్నవి. దీనికి కారణము కృష్ణుని...
[11.11.2002] అవతారము అనగా క్రిందకు దిగుట. అవతారము తత్త్వములో ఎట్టి మార్పు రాదు. పై అంతస్థులోని వజ్రము, క్రింద అంతస్థు లోనికి దిగినంత మాత్రమున గులకరాయి కాదు. అట్లే జీవుడు సాధన ద్వారా పరమాత్మతో కైవల్యము చెందినంత మాత్రమున పరమాత్మ కాజాలడు. అద్వైతకైవల్యము ఆవేశమే, అనగా పూనకమే. ఈ పూనకము పోగానే మరల జీవుడు యథాస్థానమునకు చేరును. క్రింది అంతస్థులో యున్న గులక రాయి, పై అంతస్థులోనికి ఎక్కినంత మాత్రమున అది వజ్రము...
[13.11.2002] పరమాత్మపై భక్తి కలుగక పోవుటకు లౌకిక విషయములందు ప్రేమ కలుగుటకు కారణమేమి? మనము లౌకికములైన విషయములందే ఆసక్తి కలవారి యొక్క సంగమునందే సదా ఉండుచూ రమించుచున్నాము. వారితో సదా లౌకిక విషయములను గురించియే మాట్లాడుచూ ఆనందముగా వినుచున్నాము. ఈ లౌకిక విషయములు వారి నుండి సదా ఇంజెక్షన్ వలె మన లోనికి ఎక్కుచున్నవి. వీటి ద్వారా లౌకికమగు జ్ఞానమే మనలో పెరుగుచున్నది. ఈ లౌకికజ్ఞానమే లోకబంధములపై ప్రేమకు...
[08.11.2002] నాయనా! శ్రద్ధగా విను, అనుసరించి తరించు. దత్తతత్త్వము దానము. ఈ దానములో ‘దేశము’, ‘కాలము’, ‘పాత్ర’యను మూడు భాగములుండును.
దేశము అనగా:- కాశీ మొదలగు పుణ్యక్షేత్రములందు దానము చేయుట.
కాలము అనగా:- వైకుంఠ ఏకాదశి, మార్గశిర పూర్ణిమ, శ్రీపంచమి మొదలగు పుణ్యతిథులందు దానము చేయుట. (మేము కాలమునకు ప్రాధాన్యము నిచ్చియే గదా మార్గశిరపూర్ణిమకు అన్నవరములో శ్రీసత్యదేవుని సమక్షంలో అన్నదానము, కాశీలో అక్షయ తదియ...
[07.11.2002] దత్తుడనగా దానము. అనగా స్వార్థము లేని త్యాగము. ఎవడు స్వార్థమును పరిపూర్ణముగా వదలి, పరిపూర్ణమైన త్యాగస్వరూపుడగుచున్నాడో వాడే దత్తుడగుచున్నాడు. స్వార్థము ఎంత విడచి పోవుచున్నదో ఎంత త్యాగము పెరుగుచున్నదో అంతగా వాడు దత్తునకు సమీపమగుచున్నాడు. దత్తుడు యోగియైనను...
శ్రీదత్తభగవానుడు పరబ్రహ్మమని చెప్పినపుడు ఆ మాట నోటితో చెప్పుటకు, చెవులతో వినుటకు మాత్రమే పనికి వచ్చును. ఏలననగా పరబ్రహ్మము ఊహించుటకు సైతము వీలు కానిది. కావున ‘దత్తుడు బ్రహ్మము’ అను వాక్యమునకు అర్థము దత్తుడు ఊహకు అందడనియే, మరి ఊహకు అందని దత్తుడు అత్రి మహర్షి యొక్క కన్నులకు ఎట్లు గోచరించినాడు? దేవతలు కాని, ఋషులు కాని పరబ్రహ్మమును తర్కించుటకు సైతము చేతకాని వారు గదా. అయితే "దేవతలును ఋషులును యుగ యుగముల...
[26.03.2003] లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగములు, కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము (crest), ద్రోణి (trough) అని రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ-నీడల...
[09-11-2002] జ్ఞానము కన్నను భక్తి గొప్పది. భక్తి కన్నను సేవ గొప్పది. జ్ఞానము పెరిగిన కొలది భగవంతునిపై భక్తి లేకపోవుటకు కారణము భగవంతుని గురించి జ్ఞానము తక్కువగా యుండుటయే. అయితే జ్ఞానము అనగా నేమి? పరమాత్మను గురించి తెలుసుకొనుటయే జ్ఞానము. మనకు పరమాత్మను గురించి తెలిసినది...
[12.11.2002] భగవంతుని మనము నిత్యము పూజించుచున్నాము. ఆ పూజలలో మనము ఎంతో భక్తిని కలిగియున్నాము. అయితే ఆ భక్తి పరమాత్మపై నున్న భక్తి కాదు. ఒక కోరికను సాధించుకొనుటకు పరమాత్మను సాయము కోరుచున్నాము. మనకు అనారోగ్యము వచ్చినపుడు వైద్యుని వద్దకు వెళ్తాము గదా. అపుడు ఆ వైద్యుని ఎంతో వినయముతో, శ్రద్ధతో గౌరవించుచున్నాము. ఆ గౌరవము నిజముగా డాక్టరుపై కానే కాదు. మన అనారోగ్యమును ఆ వైద్యుడు తగ్గించును...
Note: Articles marked with symbol are meant for scholars and intellectuals only