home
Shri Datta Swami
 

English   Telugu    Hindi 

స్వామి దివ్య వాణి

ఙ్ఞానయోగమునకు సద్గ్రంధములు సత్సంగములు ఎట్లు సాధనములో, భక్తి యోగమునకు భజన పాటలు అట్టి సాధనములు. భక్తి సూత్రకర్త యగు నారదుడు వీటిని సదా కీర్తించుటచేత దేవాసురులకును పూజ్యుడయ్యెను. అసురులు అనగా దుష్టులు సైతము వీటి వలన ప్రభావితులగుదురని అర్ధము. నారదుడు భక్తి అనిర్వచనీయమన్నాడు. "జారవచ్చ" "యధావ్రజగోపికానాం" అను సూత్రములలో జారుని యొక్క లోలత్వము (నిష్ఠ) తో సమానమైనది భక్తి యని, భక్తులకు ఉదాహరణముగా గోపికలను పేర్కొన్నాడు. "తన్మయాహితే" అను సూత్రములో భక్తులలో భగవంతుడు ఆవేశించి కైవల్య భావము అనగా తానే వారు, వారే తాను అనునట్లు ఉండునని చెప్పినాడు. సంసార బంధములను ఆరు కొండలను దాటి, కేవల భగవద్బంధమనే ఏడవ కొండనెక్కి అచటనున్న భక్తి యను కోనేరు గంగలో ఒక్కసారియైన మునక వేయని జీవుని జీవితము వ్యర్ధము. "ఒకసారి మునకేతునా - నా ప్రాణనాధా" వంటి భజనలతో భక్తి గంగలో ఒక్కసారి అయినా మునగండి.

 
 whatsnewContactSearch